ఆద్యాత్మికత మనిషికి ప్రశాంతతను ప్రసాదిస్తుంది - ఈటల రాజేందర్

On
ఆద్యాత్మికత మనిషికి ప్రశాంతతను ప్రసాదిస్తుంది - ఈటల రాజేందర్

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

మల్కాజ్ గిరి, ఏప్రిల్ 14 ( ప్రజా మంటలు ) :

మానవ జీవితంలో మనిషికి వచ్చే కష్టాలు, ఎవరికీ చెప్పుకోలేని ఇబ్బందులు కలిగినప్పుడు మానవుడు భగవంతునికి తన యొక్క బాధను విన్నవించడమే ఆధ్యాత్మికత అవుతుందని మాజీ మంత్రి ఈటల రాజేంద్ర పేర్కొన్నారు.

మల్కాజ్గిరి లోకసభ పార్లమెంట్ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం మల్కాజగిరి లోని బృందావన్ గార్డెన్ లో జరిగిన శ్రీ వేంకటేశ్వర కళ్యాణం లో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ......

మనిషి జీవితంలో ఆధ్యాత్మికత, ఒక క్రమశిక్షణ ను అలాగే ధర్మబద్ధంగా నిజాయితీగా బ్రతకడానికి అలవాటును నేర్పిస్తుందని ఆయన అన్నారు.

భారతీయుల డి.ఎన్. ఎ. లోనే ఆధ్యాత్మిక భావజాలం ఉందని, వారి జీవితంలో సనాతన ధర్మం నిబిడీకృతమై ఉందని, దానిని భావితరాలకు అందించడమే మన ముందున్న ఒక సవాలని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక సనాతన ధర్మ భావజాలం ఏదో ఒక రూపంలో పరిడ విల్లుతూనే ఉందని, దీనికి బ్రాహ్మణ సమాజం ఎంతగానో దోహదపడుతున్నారని ఈ టల రాజేందర్ ప్రశంసించారు, భగవంతుని కొలవడం అనేది మానవునికి ఒక అతి పెద్ద రిలాక్స్ పొందటానికి మార్గం లాంటిది అని అన్నారు, అన్ని బ్రాహ్మణ సంఘాలు ఒక్కతాటి మీదికి రావడం చాలా అభినందనీయమని మన భారతీయ వారసత్వాన్ని సాంస్కృతిక సంపదను, భావితరాలకు అందించటంలో బ్రాహ్మణ పండిత సమాజం చాలా ముందు వరసలో ఉందనడంలో అతిశయోక్తి లేదని ఈట ల రాజేందర్ అన్నారు.

నగరంలో ఇలాంటి ఎన్నో సనాతన సంప్రదాయ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని తద్వారా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సన్మార్గంలో ప్రయాణించడానికి ఒక వారధిలా బ్రాహ్మణ సమాజం ప్రయత్నం చేయాలని రాజేందర్ కోరారు ,అనంతరం మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు మాట్లాడుతూ సమాజ హితం, అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభ్యున్నతే బ్రాహ్మణ సంఘాల ఉద్దేశం ,లక్ష్యం కావాలన్నారు భారతీయులందర్నీ అన్ని కులాల వారిని ఆధ్యాత్మిక భావజాలంలో లోకి తీసుకురావడానికి బ్రాహ్మణ పండిత సమాజం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని రామచంద్రరావు పేర్కొన్నారు.

లోకసభ నియోజకవర్గాల బ్రాహ్మణ సంఘాలు అలాగే వైష్ణవ, కరణం, మధ్వ ,బ్రాహ్మణ సంఘాల వారు అందరూ ఈ వెంకటేశ్వర కళ్యాణం లో పాల్గొని లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ దేవ కళ్యాణం ప్రజలందరి సుఖ సంతోషాల కోసం అని, అందరూ ఆరోగ్యంగా బాగుండాలని, మానవ సమాజం చక్కటి సన్మార్గంలో ప్రయాణించడమే మా బ్రాహ్మణ ఐక్యవేదిక లక్ష్యం అని కన్వీనర్ మహదేవపట్ల లక్ష్మణ్ ప్రసాద్ శర్మ చెప్పారు.

మన ప్రాంతంలో మానవులలో ఆధ్యాత్మికత భక్తి భావం చాలా ఉందని తద్వారా వారి కుటుంబాలు సమాజం ఎప్పుడూ చక్కగా వుంటాయని చీఫ్ కోఆర్డినేటర్ చక్రధర్ పేర్కొన్నారు.

వెంకటేశ్వర కళ్యాణం లో స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి , మౌలాలి డివిజన్ సునీత శేఖర్ యాదవ్, బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక చీఫ్ కోఆర్డినేటర్ బి చక్రధర్, ప్రియతమ రామకృష్ణ, శ్యామ్ సుందర్ శర్మ, ఎంబీబీఎస్ అధ్యక్షులు దొర్భల కృష్ణమూర్తి శర్మ ,యలమంచి చంద్రశేఖర్ శర్మ ,సిరిసిల్ల రామ శర్మ, రాంప్రసాద్ శర్మ మహిళా నాయకురాలు విజయ లక్ష్మి, రాజనాల శర్మ ,బిజెపి నాయకులు పార్లమెంటరీ పార్టీ కన్వీనర్ ఆర్ కె శ్రీనివాస్, ఈటల జమున రాజేందర్, వి కే మహేష్ ముదిరాజ్, రాంబాబు, నగరంలోని పలు బ్రాహ్మణ సంఘాల నాయకులు మల్కాజిగిరి బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంకటేశ్వర స్వామి భక్తులు వందల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం ,రాకేష్ బృందం పాడిన అన్నమయ్య గలార్చన సాంస్కృతిక కార్య్రమాలు భక్తులను అలరించాయి.

Tags