శ్రీ నిలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు  లోక కళ్యాణార్థం సర్వారిష్ఠ శాంతి

On
శ్రీ నిలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు  లోక కళ్యాణార్థం సర్వారిష్ఠ శాంతి

శ్రీ నిలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు
 లోక కళ్యాణార్థం సర్వారిష్ఠ శాంతి

 

కరీంనగర్‌ ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు):  స్థానిక తిరుమల నగర్‌ లోని మయూరగిరి పీఠం శ్రీనిలయంలో వసంత నవరాత్రులలో భాగంగా రాముడు జన్మించిన పునర్వసు నక్షత్రమును పురస్కరించుకొని  మయూరగిరి పీఠాధిపతులు  శాస్త్ర పండితులు నమిలకొండ రమణాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో  అన్ని నక్షత్రల వారు, అన్ని రాశుల వారు, సుఖ సంతోషాలతో ఉండాలని, నక్షత్రేష్టి పూర్వక సర్వారిష్ట శాంతిని మరియు లోక కళ్యాణార్థం  జపహోమ తర్పణాలను నిర్వహించారు.  సంవత్సరము రాజు కుజుడు, మంత్రి శని, కావడం వలన సమాజంలో ఎలాంటి చెడు జరగకూడదని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మా వంతు కర్తవ్యం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీని ద్వారా కొంత వరకైన శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేశారు. లు ప్రాంతాల నుండి భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పండితులు రామకృష్ణ మాచార్యులు. వేణుగోపాలాచార్యులు, వినయ్‌ స్వామి, వివేక్‌ స్వామి, గోపి శర్మ, శివరామకృష్ణ శర్మ మొదలగు పండితులు పాల్గొన్నారు.

Tags