జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు.

On
జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ. - 9963349493/9348422113).

జగిత్యాల మే 5 (ప్రజా మంటలు)

జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయం లో ఆదివారం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, వార్డు కౌన్సిలర్ అనుమల్ల జయశ్రీ రఘు తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నంబి వేణుగోపాల ఆచార్య, రుద్రంగి గోపాలకృష్ణ శర్మ తదితరులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.... బ్రాహ్మణోత్తముల ఆశీర్వచనము తనకు ఎల్లప్పుడూ అవసరమని వారికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని బ్రాహ్మణ సంఘ భవనం నకు దసరా వరకు తాను నిధుల కోసమై కృషి చేయగలనని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ బాధ్యులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags