బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం.

- జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారం మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

On
బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల ఏప్రిల్ 20 (ప్రజా మంటలు) : 

జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 

మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ.....

*బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం*

ఏ ఇంటికి వెళ్లిన ప్రజలు స్పందిస్తూ ప్రతి ఒక్కరు మేమే కాదు మాతోపాటు ప్రతి ఒక్కరికి చెప్తూ జీవన్ అన్న గెలుపు కోసం మేము ఓట్లు వేపిస్తామని తెలుపుతున్నారు చాలా సంతోషంగా ఉంది

జీవన్ అన్న ఒక 40 సంవత్సరాలుగా జగిత్యాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు జీవన్ రెడ్డి ఎలా పనిచేస్తారు ఎలాంటి నాయకుడు అని ప్రతి ఒక్కరికి తెలుసు ఒకే ఒక ఫోన్ కాల్ తో ఏ పని అయిన చేయిస్తారని జగిత్యాల ప్రజలకు అందరికీ తెలుసు

ఈ రోజు మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటింటికి చెప్పడం జరిగింది ప్రతి ఒక మహిళ మాకు వస్తున్నాయి అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది

జగిత్యాలలో పిఎఫ్ ఆఫీస్ లేదు ఎన్నికల తదుపరి పిఎఫ్ ఆఫీస్ కూడా జగిత్యాలకు తీసుకువచ్చేలా కృషి చేస్తానని మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి తెలిపారు

మా మహిళలు బీడీ కార్మికులకు 230 రూపాయలు మజూరు వస్తుందని 300 రూపాయలు చేపిస్తానని జీవన్ రెడ్డి గారు తెలిపారు అలాగే బీడీ కార్మికులకు ఆసుపత్రి కూడా తీసుకొస్తానని తెలిపారు ఆ విషయంలో మహిళలంతా సంతోషం తెలియజేస్తున్నారు

జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడిన తదుపరి పాస్పోర్ట్ కార్యాలయం లేకపోవడం దురదృష్టకరం పాస్పోర్ట్ కార్యాలయం కూడా జీవన్ రెడ్డి చొరవ తీసుకొని పాస్పోర్ట్ కార్యాలయం కూడా తీసుకువస్తానని తెలిపారు

గతంలో ఉన్న ఎంపీ గారు ఈ కార్యక్రమాలు చేపట్టాల్సింది కానీ ఎప్పుడూ కూడా శ్రద్ధ తీసుకోలేదు.

కానీ జీవన్ అన్న దృష్టికి రాగానే చొరవ తీసుకొని ఇవన్నీ తీసుకొస్తానని తెలిపారు

యావర్ రోడ్డు చాలా ప్రధానమైనది. ఆనాడు 40 ఫీట్లు ఉన్న యావర్ రోడ్డు 60 ఫీట్లు చేసింది జీవన్ రెడ్డి గారు ఈరోజు 100 ఫీట్లు చేసేది కూడా జీవన్ రెడ్డి గారు అందుకే మనం అందరం జీవన్ అన్నని గెలిపించుకోవాలి

37 వ వార్డులో కోర్ట్ శీను కౌన్సిలర్ ఉన్నప్పుడు జీవన్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడున్న రోడ్లు గాని డ్రైనేజీలు గాని ప్రతి ఒక్కటి జీవన్ అన్న హయాంలోనే జరిగింది

జీవన్ అన్న మాత్రమే అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాలు గాని మన నిరుపేదల సమస్యలు పరిష్కారానికి కానీ మనకు తోడుగా ఉంటారు కనుక మనం జీవన్ అన్నని గెలిపించుకోవాలి అని జగిత్యాల ప్రజానీకానికి కోరుతున్నాను.

Tags