ఇప్పుడు అన్నదాతలను ఆగం చేస్తూ ఎప్పుడో రెండు లక్షల రుణమాఫీ ఇస్తారా?

ఎంపీ బండి సంజయ్

On
ఇప్పుడు అన్నదాతలను ఆగం చేస్తూ ఎప్పుడో రెండు లక్షల రుణమాఫీ ఇస్తారా?

వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎంపీ బండి సంజయ్

ఎల్కతుర్తి ఏప్రిల్ 22 ప్రజా మంటలు

ఎల్కతుర్తి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు,బండి సంజయ్ సందర్శించారు. గత15 రోజులుగా వడ్ల రాసులు పోసినా ఎవరు కొనడం లేదని, ఇటీవల కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దైయ్యాయని,కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, డిసెంబర్ 9 న 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు వేసి మరోసారి మోసం చేస్తున్నారని తెలిపారు. రైతులను వాళ్ల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు విషయంలో తేమ శాతం తరుగు పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, రైతులకు వెన్నంటీ ఉంటామని చెబుతూ, రైతు వెన్నపూస విరగగొడుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో సరైన సమయానికి కొనకపోవడతో, దళారులను ఆశ్రయించితే 1600 లకే క్వింటాలు వడ్లు అడుగుతున్నారని రైతులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బిజెపి హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి , వరంగల్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,ప్రభారీ గుజ్జ సత్యనారాయణ ,మండల నాయకులు,మోర్చ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Tags