తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి

అలిశెట్టి  ప్రభాకర్ జన్మదినం 12, జనవరి

On
తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి

తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి అలిశెట్టి  ప్రభాకర్ జన్మదినం 12, జనవరి

IMG_20240111_221643

-సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339.

తెలుగు సాహిత్యంలో అజరామరమైన నూతన సాహిత్య విలువలను, సామాన్యుని గొంతుకను బలంగా వినిపించిన మహనీయుడు, ప్రజల మనిషిగా, జీవితాన్నే సాహిత్యానికి అంకితం చేసిన చిరుకవితల కవి, మరణించి మూడు దశాబ్దాలయినా, నేటికీ వినబడుతూనే ఉంది. కవిత్వం గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా, ఆయన పేరు లేకుండా కవిత్వంపై ప్రసంగం చేయలేని విధంగా, కవిత్వంలో తన ముద్ర వేసిన అతి సామాన్యుడు. ఆయన పేరు వినిపించినంతగా, ఈ శతాబ్దంలోని ఏ కవి పేరుకాని, ఆయన కవితలు కానీ చర్చల్లో కానీ, ఉదాహరణలో కానీ పేర్కొన్న కవి మరొకరు లేరంటే, కవితలుకానీ  లేవంటే అతిశయోక్తి కాదు.

ఆడంభరాలకు, సన్మానాలకు, సభలకు, అవార్డులకు అర్రులు చాచకుండా, తన కాలం, కుంచె ఎప్పటికీ అత్తాడుగువర్గాల ప్రజలు, అణచివేతకు గురైన శ్రామికుల వెన్నంటే ఉంటుందని ఆచారణతో సహాయ ప్రకటించిన అనన్య ప్రతిభావంతుడు అలిశెట్టి. పేరులోన ప్రభాకరున్నీ ఉంచుకోవాడమే కాకుండా, ఆ ప్రభాకరునిలోని  భాస్వర స్వభావ లక్షణాలను పునికి పుచ్చుకొని, తన రక్తాన్నే సిరాగా మార్చుకొని,  సమాజంలోని అసంబద్ద సంప్రదాయాలను, కట్టుబాట్లను, రాజకీయాల్లోని కుళ్లును తన అక్షర యజ్ఞంతో  దహించి వేసే ప్రయత్నం చేసిన అనల్పజీవి అలిశెట్టి ప్రభాకర్ . 

తన కంటూ ఏమి మిగుల్చుకోవాలనే ఆశలు లేకుండా, తన చుట్టూ ఉన్న పేదల బతుకుల పట్ల ఈ సామాజిక, రాజకీయ వ్యవస్థ, తరతరాలుగా వ్యవహరిస్తున్న తీరును తన ప్రతి కవితలో  నిశితంగా విమర్శించారు. అది రాజకీయ నాయకుడైనా, సమాజంలోని ఇతర పెద్దలైనా, మనిషి సృష్టించాడాని చెప్పుకొనే దేవుడైనా ఒకే రీతిలో వ్యవహరిస్తున్నారంటూ, సమాజం తనకు తానుగా మేలుకొంటే తప్ప, ఈ సమాజంలోని బడుగుల బతుకులు బాగుపడవని హెచ్చరించారు.

స్త్రీల పట్ల సమాజ వైఖరిని కూడా నిశితంగా ఖండిస్తూ, మహిళలను ఈ సమాజం ఆటవస్తువుగా, అంగడి బొమ్మలా వాడుకొంటున్నారని ఘోషించాడు. రాజ్యాంగాలు మారినా, ప్రభుత్వాలు మారినా, నేటికీ స్త్రీల పట్ల ఈ సమాజం ఇంకా ఆటవిక యుగం నాటి దృక్పథంతోనే ఉందని, స్త్రీని పురుషుడు తన అవసరాలకు అనుగుణంగా మలుచుకొని, తన లోని రాక్షసత్వానికి ప్రతీకగా చూస్తున్నారని ప్రకటించాడు. “విషాద సాక్షాత్కారం” శీర్షికన రాసిన దీర్ఘ కవితలో స్త్రీల బాధలను వివరంగా ప్రశ్నించారు.

“కన్నీళ్లని ఏ భాషలోకి అనువాదించినా

విషాదం మూర్తీభవించిన స్త్రీయే

సాక్షాత్కరిస్తుంది” అని సిద్ధాంతీకరించారు.

ఇందులోనే “నాజీల అహం/నగ్నంగా స్త్రీలని ఊరేగించినా/ ఊచకోత జ్ఞాపకాల్లోంచీ/నాగరికత బ్లూఫిల్మై /బుసకొట్టే కామాకేళీ చిత్రాల్నుంచీ/ కన్నీళ్ళు ధారాపాతంగా ప్రవహించి / ఘనీభవించే వుంటాయ్” అంటూ మానవ జాతి చరిత్రలో ఎన్నియుగాలు మారినా, ఎంతమంది శాసనులు మారినా స్త్రీలు ఎదుర్కొన్న సమస్యలు మాత్రం రూపం మాయచుకొన్నాయే తప్ప వారికి స్వాతంత్ర్యం లభించలేదని పేర్కొంటూ, “ అశ్రు బిందువునించి/స్త్రీకినకా విముక్తి కాలగలేదంటే/నిజంగా కన్నీరు సముద్రమై/  నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై/ఉద్యమాల హోరెత్తితే గాని/ ఈ దోపిడీ దౌర్జన్యాల భూభాగాన్ని/ముంచెత్తాలేదని “స్పష్టంగా నేటి దుస్థితిని ప్రకటించారు. అందాల పోటీల గురించి రాస్తూ,    “అక్షరాన్నివివస్త్రని గావించి/ అమ్ముకొనే/ఆశలీషా సాహిత్యం నుంచీ .. కన్నీళ్ళు ప్రవహిస్తూనే వుంటాయ్” అంటూ ఆవేదన చెందారు. 

సాహిత్యకారులుగా, తెలుగు భాషకు తామే ప్రతినిధులుగా చెప్పుకొంటున్న కుహనా మేధావుల గురించి కూడా కుండబద్దలుకొట్టినట్లు తన  అంతరంగాన్ని వెల్లడించారు. సమసమాజం కొరకంటూ ప్రచారం చేసుకొంటూ, ప్రభుత్వ అవార్డులకొరకు తమవంతు కృషి చేసుకొంటూ, తమ రచనలలో తీవ్రంగా వ్యతిరేకించిన పెట్టుబడిదారు వర్గాన్ని, రాజ్యాన్ని, రాజ్యాధినేతలను ప్రసన్నం చేసుకోవడానికి, అవార్డులు పొందడానికి చేసిన శ్రమను నిరసిస్తూ, అవహేళన చేశారు. అలాంటి వారి గురించి “ అర్భకుడైన కవి ఒకడు/ అవార్డులూ / సన్మానల కోసం / దేబారించడం తప్ప/ నగరంలో నేడు/ అవాంఛనీయ/ సంఘటనలేవీ జరగలేదు” అని స్పష్టంగా వరి మనస్తత్వాన్ని, వరైకి ప్రజల పట్ల సమాజంపట్ల ఉన్నదంతా పైపై ప్రేమేనని చెప్పినట్లుగా, కవితలో చెప్పారు.

సమాజంలో సమానావకాశాలు లేక, చిటికి పోయిన బతుకులను చూసిచూసి విసిగిపోయిన ఆరోషంలో నుండి చూస్తూ, నా కవిత అనే శీర్షికతో రాసిన దాంట్లో “ నా గుప్పిట్లో / మండుతున్న/ ఎన్నో గుండెలు/ ఒక్కో దాన్లో/ దూరి/ వాటిని చీరి / రక్తాశ్రువులు ఏరి/ పరిశీలిస్తాను/ నేను” అంటూ తన సిద్ధాంతాన్ని, విధానాన్ని స్పష్టంగా తెలియజెప్పిన సామాన్య అక్షర యోధుడు అలిశెట్టికి అక్షరాంజలి.

Tags

More News...

National  International   State News 

1.5 మిలియన్ల పాలస్తీనియన్లను అరబ్ దేశాలకు తరలించాలని ట్రంప్ సూచన

1.5 మిలియన్ల పాలస్తీనియన్లను అరబ్ దేశాలకు తరలించాలని ట్రంప్ సూచన 1.5 మిలియన్ల పాలస్తీనియన్లను అరబ్ దేశాలకు తరలించాలని ట్రంప్ సూచన   వాషింగ్టన్రి జనవరి 28: జోర్డాన్ మరియు ఈజిప్ట్  గాజా నుండి ఎక్కువ మంది పాలస్తీనియన్ శరణార్థులను "శుభ్రం" చేసే ప్రయత్నంలో చేర్చుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. న్యూస్‌వీక్ పత్రిక తన నూతన కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది.గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం,...
Read More...
National  State News 

ట్రంప్ సుంకాల భయంతో స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు - భారీగా పడిపోయిన మార్కెట్లు

ట్రంప్ సుంకాల భయంతో స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు -  భారీగా పడిపోయిన మార్కెట్లు   ట్రంప్ సుంకాల భయంతో స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు  భారీగా పడిపోయిన మార్కెట్లు ముంబై జనవరి 27:   అక్రమ వలసదారులను బహిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో, రెండు అమెరికన్ సైనిక విమానాలు కొలంబియా నుండి బహిష్కరించబడిన వలసదారులను తిరిగి తీసుకువెళ్లాయి. కానీ కొలంబియా ప్రభుత్వం విమానాలను ల్యాండ్ చేయడానికి అనుమతించలేదు. దీని తర్వాత, కొలంబియా   కొలంబియాపై...
Read More...
National  State News 

ఉత్తరప్రదేశ్ లో శానిటరీ ప్యాడ్ అడిగిన విద్యార్థిని బయటకు పంపిన ఉపాధ్యాయులు

ఉత్తరప్రదేశ్ లో శానిటరీ ప్యాడ్ అడిగిన విద్యార్థిని బయటకు పంపిన ఉపాధ్యాయులు ఉత్తరప్రదేశ్ లో శానిటరీ ప్యాడ్ అడిగిన విద్యార్థిని బయటకు పంపిన ఉపాధ్యాయులు బరేలి జనవరి 27: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శానిటరీ ప్యాడ్ అడిగినందుకు బాలికను శిక్షించిన పాఠశాల యాజమాన్యంపై ప్రజలు విరుచుకుపడుతున్నారు. ప్రిన్సిపాల్ నుండి శానిటరీ ప్యాడ్ అడిగిన తర్వాత, 11వ తరగతి విద్యార్థినిని తరగతి గది నుండి బయటకు వెళ్ళమని చెప్పి దాదాపు గంటసేపు...
Read More...
National  State News 

నిర్మలా సీతారామన్ కు ఆర్థికశాస్త్రంలోని ఏబీసీలు కూడా తెలియవు -  ఎడ్యుకేషనల్ థాట్ ఫోరంలో సుబ్రమణ్యస్వామి

   నిర్మలా సీతారామన్ కు ఆర్థికశాస్త్రంలోని ఏబీసీలు కూడా తెలియవు -  ఎడ్యుకేషనల్ థాట్ ఫోరంలో సుబ్రమణ్యస్వామి నిర్మలా సీతారామన్ కు ఆర్థికశాస్త్రంలోని ఏబీసీలు కూడా తెలియవు -  ఎడ్యుకేషనల్ థాట్ ఫోరంలో సుబ్రమణ్యస్వామి   చెన్నై జనవరి 27: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామను ఆర్థికశాస్త్రంలోని ఏబీసీలు కూడా తెలియవని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ నిర్వహించిన ఎడ్యుకేషన్ థింక్ ట్యాంక్ 2025 సోమవారం (జనవరి...
Read More...
National  State News 

తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చిన తమిళనాడు ప్రభుత్వం

తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చిన తమిళనాడు ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చిన తమిళనాడు ప్రభుత్వం చెన్నై జనవరి 27: ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు మార్గదర్శిగా, తాత్కాలిక ఉపాధ్యాయులకు తమిళనాడు ప్రభుత్వం వారాల జల్లు కురిపించింది. మిగతా రాష్ట్రాలలోనూ తాత్కాలిక ఉపాధ్యాయులను, ఉద్యోగులను కూడా ఇలానే పర్మినెంట్ చేయాలని  మిగతా రాష్ట్రాలలోని తాత్కాలిక ఉద్యోగులు కోరుకొంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలోని...
Read More...
Local News 

మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కు మార్కండేయ జయంతి ఉత్సవాల ఆహ్వానం

మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కు మార్కండేయ జయంతి ఉత్సవాల ఆహ్వానం మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కు మార్కండేయ జయంతి ఉత్సవాల ఆహ్వానం (వనమాల గంగాధర్) జగిత్యాల జనవరి 27: తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి, లక్ష్మణ్ లకు  శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను  శ్రీ భక్త మార్కండేయ ఆలయ కమిటీ బుగ్గారం సంఘం సభ్యులు అందజేశారు. జగిత్యాల జిల్లా...
Read More...

సెల్ఫ్​ ఎంప్లాయిమెంట్ తో జీవనోపాధి -- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్​

సెల్ఫ్​ ఎంప్లాయిమెంట్ తో జీవనోపాధి -- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్​ సెల్ఫ్​ ఎంప్లాయిమెంట్ తో జీవనోపాధి-- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్​ సికింద్రాబాద్​, జనవరి 27 (ప్రజామంటలు): ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం తాపత్రయా పడకుండ, తాము నైపుణ్యం సాధించిన  వ్యాపారాలను  ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందాలని మాజీ మంత్రి, సనత్​ నగర్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్​ పేర్కొన్నారు. సోమవారం పద్మారావునగర్​ పార్కు సమీపంలో...
Read More...
Local News  Spiritual  

రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాసశివరాత్రి పర్వదిన ప్రత్యేక పూజలు

రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాసశివరాత్రి పర్వదిన ప్రత్యేక పూజలు రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాసశివరాత్రి పర్వదిన ప్రత్యేక పూజలు ధర్మపురి జనవరి 27: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ దేవాలయం అయిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేదికపై " రుద్ర నమకం చమకం, మన్య సూక్తం , లక్ష్మీ సూక్తం పురుష సూక్తం తో...
Read More...
Local News 

జగిత్యాల మున్సిపల్ ప్రత్యేకాధికారి గా అదనపు కలెక్టరు - అభినందనలు తెలిపిన ఆడువాల జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల మున్సిపల్ ప్రత్యేకాధికారి గా అదనపు కలెక్టరు - అభినందనలు తెలిపిన ఆడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపిన తాజా మాజీ  చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్  జగిత్యాల:- మున్సిపల్ కార్యాలయం ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సందర్భంగా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా  తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల...
Read More...
National  State News 

పరిశ్రమను మోసం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమా? - TN బీజేపీ అద్యక్షులు అన్నామలై

పరిశ్రమను మోసం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమా? - TN బీజేపీ అద్యక్షులు అన్నామలై పరిశ్రమను మోసం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమా? - బీజేపీ అద్యక్షులు అన్నామలై డీఎంకే ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి - అన్నామలై  డీఎంకే ప్రభుత్వం చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై...
Read More...
National  Local News  State News 

తలనొప్పిగా అపార్‌...ఆధార్‌, జనన ధ్రువీకరణలో తప్పులు - ఆందోళనలో తల్లిదండ్రులు

తలనొప్పిగా అపార్‌...ఆధార్‌, జనన ధ్రువీకరణలో తప్పులు - ఆందోళనలో తల్లిదండ్రులు తలనొప్పిగా అపార్‌...ఆధార్‌, జనన ధ్రువీకరణలో తప్పులు - ఆందోళనలో తల్లిదండ్రులు ఈనెల 31 వరకు వివరాలు ఇవ్వాలని స్కూళ్లకు ఆదేశాలు హైదారాబాద్ జనవరి 26:   ఒకే దేశం.. ఒకే ఐడీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్‌( ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకాడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రి) జారీ ప్రక్రియ హైదరాబాద్‌ జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. ఈనెల జాతీయ...
Read More...
Local News 

ఐఎన్టీయుసీ 3194 యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఐఎన్టీయుసీ 3194 యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ ఐఎన్టీయుసీ 3194 యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ   సికింద్రాబాద్​, జనవరి 27 ( ప్రజామంటలు): ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఐఎన్టీయుసీ 3194 హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ యూనియన్ క్యాలెండర్ ను సోమవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్  డాక్టర్ నరేంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ...ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తను ఎప్పుడు ముందుంటానని...
Read More...