సహకారం చేస్తా మద్దతు తెలపండి.
- ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న జీవన్ రెడ్డి.
On
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 1 (ప్రజా మంటలు) :
ఆర్యవైశ్య సోదరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉండి సహకరిస్తానని తనకు మద్దతు తెలిపాలని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీ జీవన్ రెడ్డి అన్నారు.
బుధవారం పట్టణంలోని వైశ్య భవనంలో నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ ఆత్మీయ సమ్మేళనం లో జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్యవైశ్య సోదరులు తనకు మొదటి నుండి మద్దతు తెలుపుతున్నారని అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్యవైశ్యులను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం బాధ్యులు, సభ్యులు జీవన్ రెడ్డికి పుష్ప గుచ్ఛము అందజేసి శాలువ తో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు సంఘ బాధ్యులు, సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Tags