సంబరాలతో అంబరాన్ని అంటిన జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ రిథం - 2K24 వార్షికోత్సవ వేడుకలు

On
సంబరాలతో అంబరాన్ని అంటిన జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ రిథం - 2K24 వార్షికోత్సవ వేడుకలు

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల ఏప్రిల్ 14 ( ప్రజా మంటలు ) : 

పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ వారి రిథమ్ - 2K24 వార్షికోత్సవ వేడుకలు స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ మంజుల రమాదేవి మరియు పాఠశాల డైరెక్టర్లు బియ్యల హరి చరణ్ రావు , జగిత్యాల జిల్లా ట్రస్మా అధ్యక్షుడు బోయినపల్లి శ్రీధర్ రావు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వారి పటానికి పూల మాల వేసి ,జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ....

" నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక అంశాలపై అవగాహన ఉండాలని తెలిపారు. విద్యార్థులు సామాజికంగా పట్టు లేకపోవడంతో చాలా అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

యువత వివిధ బాధ్యతాయుతమైన పనులు చేపట్టి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు . ప్రతి విద్యార్థి తాను అనుకున్న ఆశయాలు సాధించి ఆదర్శంగా ఉండాలని సెల్ఫోన్లకు, ఇతర వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ పరంగా విషయాలను తెలుసుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. 

విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అవసరమని మరియు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పలు రకాల నృత్యాలు నాటికలు ప్రేక్షకులను అల్లరించాయి. అంబేద్కర్ జీవిత చరిత్ర నాటిక ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

ఇతిహాసాల గురించి తెలిపే రామాయణం, దశావతారం. దేశభక్తిని కలిగించే విధంగా ఆర్మీ సాంగ్, పల్లె వాతావరణన్ని, ప్రకృతిని రైతుల గొప్పతనన్ని తెలిపే సాంగ్,అన్ని పండగల ప్రాముఖ్యత తెలిపే నృత్యం,ప్లాస్టిక్ నిషేధం, రోడ్డు భద్రతా , మొబైల్ వల్ల కలిగే నష్టాల గురించి తెలిపే నృత్యాలు చూపరులను ఆలోచింప చేశాయి.

ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరి చరణ్ రావు, శ్రీధర్ రావు, జే . హరి చరణ్ రావు, మంజుల రమాదేవి ,మౌనిక రావు, రజిత , అజిత , సుమన్ రావు , ఉపాద్యాయ బృందం ,తల్లి తండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags