ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లా ఎస్ కె ఎన్ ఆర్ కళాశాల విద్యార్థి చింత మధు.

On
ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లా ఎస్ కె ఎన్ ఆర్ కళాశాల విద్యార్థి చింత మధు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల ఏప్రిల్ 28 ( ప్రజా మంటలు ) : 

ఈ నెల 23 తేదీన జరిగిన హాండ్ బాల్ ఇంటర్ కాలేజి సెలక్షన్స్ కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగాయి,   

ఈ సెలక్షన్లలో జగిత్యాల జిల్లా ఎస్ కెఎన్ఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన బిఏ 2వ ఇయర్ విద్యార్ధి చింత మధు శాతవాహన యూనివర్సిటీ తరపున ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటి కీ హండ బాల్ గేమ్ కి సెలక్షన్ అయ్యారు.

ఈ పోటీలు తేది మే 2 నుండి మే 12 వరకు మహత్మ గాంధీ యూనివర్శిటి కేరళ రాష్ట్రం లోని కొట్టాయంలో జరుగుతాయి. 

ఈ సందర్భంగా జగిత్యాల ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం సి హెచ్. మధు కు మెమొంటోను అందజేసి శుభాకాంక్షలు తెలిపి అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరిగెల అశోక్, వైస్ ప్రిన్సిపాల్ కరుణాకర్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్డా. కోరుకంటి రవి కుమార్, ఎలిజబెత్ రాణి, మరియు అధ్యాపకులు ఉన్నారు.

Tags