రాహుల్ గాంధీ  ప్రధాని ఐతే తప్ప రిజర్వేషన్లను కాపాడే వారు లేరు 

On
రాహుల్ గాంధీ  ప్రధాని ఐతే తప్ప రిజర్వేషన్లను కాపాడే వారు లేరు 

రాహుల్ గాంధీ  ప్రధాని ఐతే తప్ప రిజర్వేషన్లను కాపాడే వారు లేరు 

ధర్మపురి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో వంశి ని గెలిపించాలి 
-సీఎం రేవంత్ రెడ్డి 

జగిత్యాల జిల్లా ప్రతినిధి/రాజేష్ బొంగురాల,మే 03(ప్రజా మంటలు):పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజున ఎండపెల్లి మండలం రాజరాం పల్లె గ్రామంలో నిర్వహించిన జన జాతర సభ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్యే విజయ రమణారావు,ఎమ్మెల్యే వివేక్,ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యే వినోద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ మీకు తెల్వనోడు కాదనీ,గత ఎన్నికల్లో మోసం చేసి గెలిచిన ఈశ్వర్ నీ ఈ ఎన్నికల్లో బండకేసి కొట్టి లక్ష్మణ్ కుమార్ ని గెలిపించారని,బిఆర్ఎస్ నుండి అభ్యర్థి ఎవరు లేకపోవడంతో ఈశ్వర్ నీ నిలబెట్టారని,వారికి ఎంపీగా నిలబడే నైతిక అర్హత కూడా లేదనీ,బి.ఆర్.ఎస్ సచ్చిన పాము అని,కొన ఊపిరితో ఉందని,దాని పడగ మీద ఓటు అనే దెబ్బ కొడితే బి.ఆర్.ఎస్  పిడ విరగడవుతుందని,బీజేపీ ప్రభుత్వం నోరు విప్పితే ప్రతిదీ అబద్ధమేనని,గుజరాత్ ని ఒకలాగ,తెలంగాణని ఒక లాగ చూస్తూ సవతి ప్రేమ చూపిస్తున్నారనీ,ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారో చెప్పాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని,ప్రజలు బీజేపీ కి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ రద్దుకు వేసే పోటు అని,రాహుల్ గాంధీ  కుటుంబానికి పదవుల వ్యామోహం లేదని,రాహుల్ గాంధీ  ప్రధాని ఐతే తప్ప రిజర్వేషన్లను కాపాడే వారు లేరని,ధర్మపురి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో వంశి ని గెలిపించాలని ఈ సంధర్బంగా కోరారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
పెద్దపెల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గంలో నిర్వహించిన జన జాతర సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని,గత పది సంవత్సరాల బి ఆర్ యస్ ప్రభుత్వ పాలనలో ధర్మపురి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గా,విప్ గా,మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ధర్మపురి ప్రజానీకానికి రైతాంగానికి అవసరమైన సాగు,త్రాగు నీటి సమస్య పరిష్కారం చేయలేదని,ధర్మపురిని రెవెన్యూ డివిజన్ గా కూడా చేయలేదని,ఒక బస్ డిపో కూడా ఏర్పాటు చేయలేదని,పత్తిపాక వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేస్తానని అప్పటి మంత్రి హరీష్ రావు ప్రకటన చేయడం జరిగిందని,ఇప్పటి వరకు దాన్ని  ఎక్కడ ఆచరణలో ముందుకు తీసుకెళ్ళలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గారెంటిలలో 5 గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందని,ప్రజా కుటుంబం నుండి వచ్చిన యువకుడు వంశీ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.

Tags