ఘనంగా ప్రారంభమైన విద్యుత్ శాఖ భద్రతా వారోత్సవాలు.

విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ భద్రతా సూచనలు చేస్తూ విద్యుత్ ప్రమాదాలు నివారించాలని కోరిన జిల్లా ఎస్.ఈ. జి. సత్యనారాయణ.

On
ఘనంగా ప్రారంభమైన విద్యుత్ శాఖ భద్రతా వారోత్సవాలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) 

 

జగిత్యాల మే 01 ( ప్రజా మంటలు ) : 

టిఎస్ఎన్ఎడిసిఎల్ సి.యం.డి కర్ణాటి వరుణ్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ నెల 01-05-2024 నుండి 07-05-2024 వరకు భద్రతా వారోత్సవాలు జరిపి రైతులకు, విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ భద్రతా సూచనలు చేస్తూ విద్యుత్ ప్రమాదాలు నివారించాలని కోరారు.

సందర్బంగా జి. సత్యనారాయణ, ఎస్ ఈ, జగిత్యాల, విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు వినియోగదారులు మరియు విద్యుత్ సిబ్బంది కూడా తప్పనిసరిగా అనుసరించాలని విజ్ఞప్తి చేశారు అలాగే కొన్ని ముఖ్య సూచనలు తెలపడం జరిగింది అందులో ముఖ్యంగా :

  • రాబోయే వర్షాకాల నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉన్నందున రైతులకు, విద్యుత్ వినియోగదారులందరికీ విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు,
  • మీ దగ్గరలో కాని, మీ ఇంట్లోగాని, పొలాల వద్ద గాని, తడి చేతులతో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకోకండి.
  • ముఖ్యంగా బట్టలు ఆరేసే దండెంలకు విద్యుత్ వైర్లు తాకకుండా చూసుకోండి, విద్యుత్ ప్రవహిస్తున్న వైర్లకు ఎలాంటి అతుకులు లేకుండా చూసుకోండి, ఒక వేళ అలాంటి అతుకులున్న వైర్లను వెంటనే అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ తో సరి చేయించండి/ మార్పించండి.
  • ఆరుబయట ఉన్న విద్యుత్ స్తంభాలను తాకకండి.పశువులను స్తంబాలకు కట్ట కూడదు.
  • రైతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్లకండి, మీ యొక్క స్టార్టర్ డబ్బాలను నీటిలో తడవకుండా పైకి ఏర్పాటు చేసుకోగలరు. స్టార్టర్ డబ్బాలు ఇనుపవి కాకుండా ప్లాస్టిక్ పి.వి.సి డబ్బాలను ఏర్పాటు చేసుకోగలరు. స్టార్టర్ వద్ద రబ్బర్ మ్యాట్ పరచి, దాని పై నిలబడి ఆన్ ఆఫ్ చేయవలెను.
  • వోల్టేజ్లో హెచ్చు తగ్గలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
  • వర్షాల వల్ల చెట్లు లేక చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
  • వ్యవసాయ నిమిత్తము మరియు గృహాలలో అతుకులు లేని నాణ్యమైన సర్వీసు వైరును మాత్రమే ఉపయోగించండి.
  • తెగిపడిన, వేలాడుతున్న, వదలుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు మరియు వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయగలరు.
  • ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు.  షాక్ గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని కర్ర, ప్లాస్టిక్ లాంటి వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం.
  • ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంటు మోటార్లను కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమర పాటుతో తాకకూడదు.
  • వ్యవసాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను.
  • విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు మరియు ఫుట్ వాల్వ్ లు తాకడం అత్యంత ప్రమాదకరం.
  • డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం మరియు కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం.
  • మోటారు మరియు పంపుసెట్లకు ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే స్వంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం/హాని జరగవచ్చు. మోటారు రిపేరు తెలిసిన వారిచేతనే రిపేర్లు చేయించండి.
  • వర్షాలు కురుస్తున్నప్పుడు/కురిసినప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాల స్టేవైరు / సపోర్టు వైరును మరియు తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకరాదు.
  • రైతులు/వినియోగదారులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు మరియు సర్విస్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా దూరంగా నడవాలి.
  • రైతు సోదరులు తమ పంటలను వన్యప్రాణులు, అడవి జంతువుల బారి నుండి రక్షించుకోవ డానికి విద్యుత్ కంచెలు వేసినచో వారిపై కఠిన చర్యలు తీసుకొనబడును, శిక్షార్హులు.
  • ఎవరైన విద్యుత్ కంచెలు వేసినట్లు తెలిసిన క్రింది ఉన్న టోల్ ఫ్రీ నంబర్లకు తెలియజేయాల ని కోరారు.
  • గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బందికి జూనియర్ లైన్ మెన్, లైన్ మెన్ , లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్ మెన్, సబ్ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ గార్లను సంప్రదించి వారి సేవలను పొందండి.
  • గ్రామ పంచాయితిలో, సెక్షన్ ఆఫీసుల్లో ప్రదర్శించిన వారి మొబైల్ నంబర్లను తమ దగ్గర ఉంచుకోవాలన్నారు.

విద్యుత్ సంబంధిత సమస్యలకు & ఫిర్యాదులు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నెంబరు.1800 4250028 కు లేదా 1912 కు ఫోన్ చేయగలరని మనవి.

భద్రతా వారోత్సవాల సందర్బంగా జి. సత్యనారాయణ - ఎస్ ఈ, జగిత్యాల గోడ ప్రతులను, కరపత్రాలను, బుక్స్ ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమం లో డి ఈ లు గంగారాం, తిరుపతి, రవీందర్, ఏ డి లు నగేష్ కుమార్, మనోహర్, ఆంజనేయ రావు, రఘుపతి, అనిల్ కుమార్ మరియు ఏ ఈ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags