వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్

ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద బాణసంచా పేల్చిన టిఆర్ఎస్ శ్రేణులు

On
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్

హర్షం వ్యక్తం చేసిన ములకనూరు గ్రామ ప్రజలు

 భీమదేవరపల్లి ఏప్రిల్ 12 (ప్రజామంటలు) :

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన సుధీర్ కుమార్, మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఎల్కతుర్తి మండలం నుండి జెడ్పిటిసిగా గెలుపొంది ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ కి విధేయుడుగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. సుధీర్ కుమార్ కు ఎంపీ టికెట్ రావడం పట్ల భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

బాణసంచా పేల్చి టపాసులు కాల్చిన ముల్కనూర్ బిఆర్ఎస్ శ్రేణులు

భీమదేవరపల్లి మండల ముల్కనూరు గ్రామ వాస్తవ్యులు ప్రస్తుత హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కెసిఆర్ గారు ప్రకటించడాన్ని హర్షిస్తూ ఆయన అభిమానులు ఆయన స్నేహితులు గ్రామంలోని ప్రజలు, భీమదేవరపల్లి  బిఆర్ఎస్ మండల పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మండల సురేందర్, జెడ్పిటిసి వంగ రవీందర్, ములుకనూర్ బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షలు శనిగరపు సదానందం ముల్కనూరు ఎంపిటిసి 1 బొల్లంపల్లి రమేష్, ఎంపీటీసీ 2 అప్పని పద్మ బిక్షపతి,  మహేందర్ రెడ్డి,  మైనార్టీ రాష్ట్ర నాయకులు నవాబు పాషా, మాడుగుల అశోక్  బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags