కవితక్క అంటే అభివృద్ధి, కవితక్క అంటే ఆధ్యాత్మికత. - దావ వసంత సురేష్.
(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 13 (ప్రజా మంటలు) :
ఈ రోజు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలోని శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని స్థానిక బిఆర్ఎస్ నేతలతో కలిసి దర్శించుకొని,దేవాలయంనికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు 86 లక్షల నిధులతో గోపురం మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
భక్తులకు కోరుకున్న వారికి కొంగుబంగారం లా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పెంబట్ల శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి దేవాలయం,ఇలాంటి దేవాలయానికి కాంపౌండ్ వాల్ గోపురం లేదని స్థానిక నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి దృష్టికి తీసుకెళ్లగా ఆమె వెంటనే స్పందించి 86 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని అన్నారు.
నిర్మాణ పనులు వేగంగా జరిగి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వచ్చే మహాశివరాత్రి కల్లా భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.
గతంలో ఆమె నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి జగిత్యాల పట్టణంలోని గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయానికి మరియు కొండగట్టు ఆంజనేయ అంజన్న స్వామి దేవాలయాలకు కూడా నిధులు మంజూరు చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
కరోనా కష్టకాలంలో 81 రోజులు కొండగట్టులో హనుమాన్ చాలీసా కార్యక్రమం చేసి తమ ఆధ్యాత్మికతను చాటుకున్నారు.కవితక్క అంటే అభివృద్ధి, కవితక్క అంటే ఆధ్యాత్మికత అని అన్నారు.
ఇప్పుడున్న కొందరు నేతలు శిలాఫలకం మీద పేర్లకు మాత్రమే పరిమితమయ్యారని, జగిత్యాల జిల్లా అభివృద్ధి కుంటు పట్టిందని, మళ్లీ జగిత్యాలకు కవితక్క రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు.
ఆధ్యాత్మిక మరియు అభివృద్ధి పనులు చేస్తున్న కవితక్క గారిపై ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తేలు రాజు, సారంగాపూర్ మాజీ పాక్స్ చైర్మన్ సత్యం రావు, మండల యువజన అధ్యక్షులు మదన్ సిలివెరీ,ఓడ్నాల జగన్, అత్తినేని నరేష్, ఆకుల తిరుపతి, ఎండబెట్ల ప్రసాద్,సాంబారి,గంగాధర్,రమేష్,జలంధర్, అలీం, వేణు,బడివేణి రవి, బండారి వెంకటేష్ ,సుమన్ నాయక్, అరవింద గౌడ్, రవి గౌడ్,శ్రీను, సిగిరి రాజిరెడ్డి, గోపాల్ సార్. తదితరులు పాల్గొన్నారు