రైతాంగం ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు వాడాలి. - చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

On
రైతాంగం ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు వాడాలి. - చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు) : 

పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శుక్రవారం రోజున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మొదట కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేసి, పలువురు రైతులను సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.....ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో తనను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,పరిశోధకుల ఆలోచనలు అనుగుణంగా రైతాంగం ముందుకు వెళ్లాలని,రైతాంగ కూడా ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు వాడాలని,అదే విధంగా పొలాస కలశాల అభివృద్ధికి తనవంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అదే విధంగా కళాశాల కి సంబంధించిన పలు సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని ఎమ్మెల్సీ జీవన్ ఆధ్వర్యంలో సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు మరియు రైతులు,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags