ఓటర్లు 'నేషన్ ఫస్ట్' వైపే, 'కుర్సీ ఫస్ట్' పాలిటిక్స్ తిరస్కరణ

  'నేషన్ ఫస్ట్' కే ప్రజల మద్దతు'- ప్రధాని మోడీ - విజయోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ

On
ఓటర్లు 'నేషన్ ఫస్ట్' వైపే, 'కుర్సీ ఫస్ట్' పాలిటిక్స్ తిరస్కరణ

  'నేషన్ ఫస్ట్' కే ప్రజల మద్దతు'- ప్రధాని మోడీ 

ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు

న్యూ ఢిల్లీ నవంబర్ 23

ఓటర్లు 'నేషన్ ఫస్ట్' కె ప్రజల మద్దతు, 'కుర్సీ ఫస్ట్' పాలిటిక్స్ ఆఫ్ ఇండియా బ్లాక్‌ని తిరస్కరించారని విజయోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ అన్నారు.

ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలలో ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, రాజ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.

మహారాష్ట్రలో విభజన వాదులు ఘోర పరాజయం పాలయ్యారు, కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయి, అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి, వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలి, UP, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరింది, షిండే, ఫడ్నవీస్‌, అజిత్‌పవార్‌కు అభినందనలు, 50 ఏళ్ల తర్వాత ఇది అతి పెద్ద విజయమని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ నేతలారా చెవులు రిక్కించి వినండి, ప్రపంచంలో ఏశక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదు, దేశంలో ఒకే రాజ్యాంగం ఉంది, అది అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ఒక్కటే, రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ అవమానించాలని చూసింది, రెండు రాజ్యాంగాలు ఉండాలన్న  కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు, సీఎంలను తీసుకొచ్చి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు, పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ హామీలు అమలు చేయలేదు, అందుకే జనం కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పరాన్నజీవిగా మారింది, ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, హర్యానాతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఖాతా ఖాళీ అయింది, కాంగ్రెస్‌ విభజనవాద రాజకీయాలు విఫలం,  రాజ్యాంగంలో వక్ఫ్‌ చట్టానికి స్థానమే లేదు.ఓట్ల కోసం కాంగ్రెస్‌ వక్ఫ్‌ చట్టం తెచ్చిందని ప్రధాని మోడీ విమర్శించారు.

Tags