తెలంగాణ పట్టభద్రుల గొంతుకనై, సమస్య పరిష్కారానికి కృషి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రతిపాదిత అభ్యర్థి శేఖర్ రావు 

On
తెలంగాణ పట్టభద్రుల గొంతుకనై, సమస్య పరిష్కారానికి కృషి

IMG_20241123_183013IMG-20241123-WA0754పట్టభద్రుల గొంతుకనై సమస్య పరిష్కారానికి కృషిIMG-20241123-WA0754 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రతిపాదిత అభ్యర్థి శేఖర్ రావు 

(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పోటీ చేయాలని భావిస్తున్న తనకు అవకాశం కల్పిస్తే, పట్టభద్రుల గొంతుకనై సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అహోరాత్రులు శక్తివంచన లేకుండా కృషి చేయగలనని పైవేటు పాఠశాలల యాజమాన్య సంఘ రాష్ర్ట మాజీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్య సలహాదారు యాదగిరి శేఖర్ రావు అన్నారు. శనివారం 
పట్టభద్రుల ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ధర్మపురి క్షేత్రాన్ని సందర్శించి, లక్ష్మీ నరసింహ స్వామి  దర్శనం చేసుకుని ఆశీర్వాదం అందుకున్న అనంతరం పలు పట్టభద్రులను స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో శేఖర్ రావు మాట్లాడుతూ ... ప్రజల సమస్యల పై స్పందించడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారని, పట్టభద్రుల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నానన్నారు. అలాగే స్థానిక సమస్యలపై మాట్లాడుతూ, తెలంగాణలోనే ఘన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో ఒక ప్రభుత్వ
డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా దురదృష్టకరం అని అన్నారు. తాను గెలిస్తే, డిగ్రీ కళా శాల మంజూరుకై  కృషి చేస్తానని చెప్పారు.
 వర్షాకాలంలో వరదలు రావడంతో చాలావరకు ఇల్లు వరదల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని, దానికి శాశ్వత పరిష్కారంగా వరద గట్టు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పట్టించుకోకుండా వదిలేసిన రోళ్ల వాగు ప్రాజెక్టు నిర్మాణం వెంటనే చేపట్టేలా కృషి చేస్తానని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ధర్మపురికి సంబంధించిన మురికి నీరు మొత్తం గోదావరి నదిలోకి మళ్లించినందున భవిష్యత్తులో మరో హుస్సేన్ సాగర్ లాగా తయారయ్యే అవకాశం ఉన్నందున అందులోకి వచ్చే మురుగునీరు ఫిల్టర్ చేసి వదిలేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లా ట్రస్మా గౌరవ అధ్యక్షులు సంగనబట్ల దినేష్, ధర్మపురి ట్రస్మా మండల అధ్యక్షులు జాజాల రవీందర్, కార్యదర్శి గడ్డం వేణుగోపాల్, చిలువేలు శ్యాంసుందర్, చల్ల శ్రీనివాస్, అరికిల సతీష్, గుర్రం ఆనందరెడ్డి చొప్పదండి ట్రస్మా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Tags