వలలో చిక్కిన అరుదైన చేప - సక్కరమౌత్ క్యాట్ ఫిష్

On
వలలో చిక్కిన అరుదైన చేప - సక్కరమౌత్ క్యాట్ ఫిష్

వలలో చిక్కిన అరుదైన చేప - సక్కరమౌత్ క్యాట్ ఫిష్. 

జగిత్యాల నవంబర్ 23:

పట్టణం లోని చింతకుంట చెరువులో గంగ పుత్రులు చేపల వేటకు వెళ్లగా, తులసినగర్ కి చెందిన గంగపుత్రుడు కల్లూరి నవీన్ కు "సక్కరమౌత్ క్యాట్ ఫిష్" అనే అరుదైన చేప వలకు చిక్కింది.

ఈ చేపని చేపల మార్కెట్లో కి అమ్మకానికి తీసుకొని రాగా చేపల కొనుగోలు చేయడానికి వచ్చిన వారు ఇలాంటి చేపను అరుదుగా చూడడం అని ఆశ్చర్యంతో చూశారు.

ఇలాంటి చేపలు అరుదుగా ఉంటాయని, ఇవి ఎక్కువగా ఉష్ణ మండలంలోని మంచినీటిలో ఉంటాయనీ కల్లూరి నవీన్ తెలిపారు. దీనిని ఇంకా కామన్ ప్లేకో లేదా హైపో స్టోమస్ అని కూడా అంటారని వివరించారు.

Tags