ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్

టాఫిక్​పై అవెర్నెస్​   * ఆన్​లైన్​ లో పాల్గొన్న 300 , ఆఫ్​ లైన్​ లో 200 మంది వైద్యులు

On
ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్

ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్​
  * దేశంలోనే మొదటిసారిగా ఈ టాఫిక్​పై అవెర్నెస్​
  * ఆన్​లైన్​ లో పాల్గొన్న 300 , ఆఫ్​ లైన్​ లో 200 మంది వైద్యులు

సికింద్రాబాద్​ నవంబర్​ 02 (ప్రజామంటలు) :

ట్రాన్స్​ జెండర్ల వైద్యం, వారిలో వచ్చే మానసిక, శారీరక నిర్మాణాల్లో వ్యత్యాసాలు, హార్మోన్ల ప్రభావం తదితర అంశాల్లో డాక్టర్లకు అవగాహన కల్పించేందుకు గాను గాంధీ మెడికల్​ కాలేజీ ఫిజియోలజీ డిపార్ట్​ మెంట్​ ఆధ్వర్యంలో ఒక రోజు కంటిన్యూస్​ ప్రొఫెషనల్​ డెవలప్​మెంట్​ (సీపీడీ) సెమినార్​ నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా జరిగిన ఈ రాష్ర్ట స్థాయి అవెర్నెస్​ సెమినార్​ లో రాష్ర్టంలోని పలు ప్రభుత్వ వైద్యశాలల్లోని ప్లాస్టిక్​ సర్జరీ, సైకాలజీ, ఫీజియోలజీ, ఎండొక్రనాలజీ, సైకియాట్రిక్​,ఫోరెన్సిక్​, తదితర డిపార్ట్​ మెంట్ వైద్య నిపుణులు పాల్గొని ఆఫ్​ లైన్​ లో 200 మంది, ఆన్​ లైన్​ లో 300 మంది మొత్తం 500 మంది డాక్టర్లకు  ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై వివరించారు. ఈసందర్బంగా ప్రొగ్రామ్​ చైర్​పర్సన్​, గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియోలజీ ప్రొఫెసర్​ రమాదేవి మాట్లాడుతూ..దేశంలో ప్రస్తుతం ట్రాన్స్​ జెండర్ల హక్కుల కోసం వాయిస్​ పెరుగుతుందని, ఈ నేపద్యంలో ట్రాన్స్​ జెండర్లకు కూడ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో 32 ట్రాన్స్​ జెండర్ల కు ప్రత్యేక వైద్య విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు.  త్వరలో గాంధీ ఆసుపత్రిలో ట్రాన్స్​ జెండర్లకు ప్రత్యేక క్లినిక్​ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్​ చేసిన డాక్టర్​ ప్రాచీ రాథోడ్​  ప్రస్తుతం నిజామాబాద్​ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్​ లో పీజీ చేస్తుందన్నారు. దేశంలో ప్రథమ ట్రాన్స్​ జెండర్​ పీజీ డాక్టర్ గా ఆమె ఖ్యాతి పాధించిందన్నారు. ఈసందర్బంగా డా.ప్రాచీ రాథోడ్​ సెషన్​ కు హాజరై ట్రాన్స్​ జెండర్​ గా తనకు ఎదురైన అరోగ్య, మానసిక సమస్యలు, తదితర అంశాలపై సమావేశంలో తన ప్రసంగంలో వివరించారు. అలాగే ట్రాన్స్​ జెండర్​ గా మార్పు చెందిన తర్వాత వచ్చే లీగల్​ సమస్యలపై యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్​ కాలేజీ ఫోరెన్సిక్​ మెడిసిన్​ హెచ్​ఓడీ ప్రొఫెసర్​ డా.లావణ్య కౌసిల్​ ప్రసంగించారు. హార్మోన్ల ప్రభావంపై ఉస్మానియా మెడికల్​ కాలేజీ ఎండోక్రానలజీ ప్రొఫెసర్​ డా.రాకేశ్​ కుమార్​ సహాయ్​, బీబీనగర్​ ఏయిమ్స్​ సైకియాట్రిక్​ అసోసియేట్​ ప్రొఫెసర్​ డా.మాలతేశ్​, ప్లాస్టిక్​ సర్జరీ ప్రొఫెసర్​ డా.పాలుకూరి లక్ష్మీ, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్​ కాలేజీ గైనకాలజీ హెచ్​ఓడీ ప్రొ.మహాలక్ష్మీ, చేవేళ్ళ పట్నం మహేందర్​ రెడ్డి మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.డి.జోయరాణి లు సమావేశంలో ట్రాన్స్​ జెండర్లకు సంబందించిన అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.కే.ఇందిర, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​ ప్రొ.రాజకుమారి, సెమినార్​ చైర్​ పర్సన్​ప్రొఫెసర్​ రమాదేవి,  వైస్​ ప్రిన్సిపాల్​ డా.రవిశేఖర్​ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్​ డా.సుభోద్​ కుమార్​, ఫిజియోలజీ మోహన్​ రెడ్డి, ఆయా ఆసుపత్రుల నుంచి వచ్చిన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు
–––––––––––––
–ఫొటో

Tags